తెలుగు సినిమా పాటలు
1.
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో
ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని
మసకేయని పున్నమిలా మనికినింపుకో
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం
2.
ఎవరో ఒకరు ఎపుడో అపుడు...
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు...
అటో ఇటో ఎటో వైపు...
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి...
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి...
వెనుక వచ్చువాల్లకు బాట అయినది ... ||ఎవరో ఒకరు||
కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా...
అనుకొని కోడి కూత నిదరపోదుగా...
జగాతికి మేలుకొలుపు మానుకోదుగా ...
మొదటి చినుకు సూటిగా దూకి రానిదేయ్...
మబ్బు కొంగు చాటుగా వొదిగి దాగితే...
వాన ధార రాదుగా నేల దారికి...
ప్రానమంటూ లేదుగా బ్రతకటానికి ...||ఎవరో ఒకరు||
చెదరక పోడుగా చిక్కని చీకటి...
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి...
దానికి లెక్క లేదు కలరాతిరీ...
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని...
రెప్ప వెనక ఆపని కంటి నీటిని...
సాగలేక ఆగితే దారి తరుగునా?...
జాలి చూపి తీరమే దరికి చేరునా...?...||ఎవరో ఒకరు||
యుగములు సాగినా నింగిని తాకక ...
ఎగసిన అలల ఆశ అలసిపోదుగా...
ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా...
ఎంత వేడి ఎందాకా ఒళ్లు మండితే...
అంత వాడి ఆవిరి వెళ్లి చీరదా...
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా..
నల్ల మబ్బు కమ్మితే చల్లబారదా...?...||ఎవరో ఒకరు||
3.
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
గగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా తరలి|| వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందునుకాదా ప్రతి మదినిలేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏవి సొంతం కోసం కాదను సందేశం మంచనే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద తరలి|| బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా బ్రతుకున లేని శృతి కలదా ఎదసడిలోనే లయలేదా ఏ కళకైన ఏ కలకైన జీవితరంగం వేదిక కాదా ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం కూసే కోయిల పోటే కాలం ఆగిందా మారే ఏరే పారే మరో పదం రాదా మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద తరలి||4.
అలిగిన వేళనె చూడాలి
గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
రుసరుసలాడే చూపుల లోనే ముసిముసి నవ్వుల చందాలు
అలిగిన వేళనె చూడాలి
అల్లన మెల్లన నల్లపిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన తల్లి మేలుకొని దొంగను జూచి ఆ... అల్లరిదేమని అడిగినందుకే
అలిగిన వేళనె చూడాలి
గోకులకృష్ణుని అందాలు
అలిగిన వేళనె చూడాలి
మోహనమురళీగానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా దృష్టి తగులునని జడిసి యశోద తనను చాటుగా దాచినందుకే
అలిగిన వేళనె చూడాలి
5.
నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు
నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలొ
కలసి పొదు నీలొ
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం
నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే
6.
పాడుతా తీయగా సల్లగా
పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా -
బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా
కునుకుపడితె మనసు కాస్త కుదుటపడతది
కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది
కలలే మనకు మిగిలిపోవు కలిమి సివరకూ
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకు? // పాడుతా తీయగా //
గుండె మంటలారిపే సన్నీళ్ళు
కన్నీళ్లు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు
పోయినోళ్ళు అందరూ.. మంచోళ్ళు
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు // పాడుతా తీయగా //
మణిసిపోతే మాత్రమేమి మనసు ఉంటదీ
మనసుతోటి మనసెపుడో కలసిపొతది
సావుపుటక లేనిదమ్మ నేస్తమన్నదీ
జనమజనమకది మరి గట్టిపడతది // పాడుతా తీయగా //
7.
రఘుపతి రాఘవ రాజారాం..పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నాం..సబ్ కో సన్మతి దే భగవాన్
ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ..ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ..
ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ..ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ..
కరెన్సీ నోటు మీద..ఇలా నడి రోడ్డు మీద..
మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ..
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ..
తరతరాల యమయాతన తీర్చిన వరదాతరా గాంధీ..
రామనామమే తలపంతా..ప్రేమధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత..అపురూపం ఆ చరిత..
ధర్మయోగమే జన్మంతా..ధర్మక్షేత్రమే బతుకంతా..
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత.. ఈ బోసినోటి తాత..
మన లాగే ఓ తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధీ..
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన సూక్తి..
సత్య అహింసల మార్గ జ్యోతి..నవ శకానికే నాంది..
రఘుపతి రాఘవ రాజారాం..పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నాం..సబ్ కో సన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజారాం..పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరో నాం..సబ్ కో సన్మతి దే భగవాన్
గుప్పెడు ఉప్పును పోగేసి..నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత..సిసలైన జగజ్జేత
చరక యంత్రం చూపించి..స్వదేశీ సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపుటేనుగులను బంధించాడురా జాతి పిత..సంకల్ప బలం చేత..
సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి..
తూరుపు తెల్లారని నడిరాతిరికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి..
పదవులు కోరని పావన మూర్తి..హృదయాలేలిన చక్రవర్తి..
ఇలాంటి నరుడొకడు ఇలా తలం పై నడయాడిన ఈనాటి సంగతి..
నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరాలకు చెప్పండి..
సర్వజన హితం నా మతం..అంటరానితనాన్ని అంతః కలహాల్ని..
అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం..
హే రాం..
8.
ఆకాశ దేశాన
ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం
వానకారు కోయిలనై తేల్లవారి వేన్నలనై
వానకారు కోయిలనై తేల్లవారి వేన్నలనై
ఈ యేడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదనా నా విరహ వేదనా
ఆకాశ దేశాన||
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మేదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మేదనై
ఈ నిషీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్పజల దారలతో
ఆ..ఆ..ఆ..ఆ
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరనయాతనా
ఆకాశ దేశాన||
9.
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ
సరసా సరాగాల సుమరాణినీ .. స్వరసా సంగీతాల సారంగినీ
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుకా
మవ్వంపు నటనాల మాతంగినీ
కైలాశ శిఖరాగ్ర శైలూషికా నాట్య డోలలూగే వేళ రావేల నన్నేల !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ
నిన్నే ఆరాధించు నీ దాసినీ.. ప్రేమ ప్రాణాలైన ప్రియురాలినీ
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరిమల్లినీ
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో .. గోదారి గంగనై పొంగుతు ఉన్నా !
నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకి నే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
10.
అహ అల్లరి అల్లరి చూపులతొ ఒక గిల్లరి మొదలాయె
ఇహ మెల్లగ మెల్లగ యెదలొన చిరు గిల్లుడు షురువాయె
అరె చెక్కిలి గిలిగిలిగింతాయె ఈ తిక్క గాలి వలన
మరి ఉక్కిరిబిక్కిరి అయిపోయె ఈ రాతిరి దయవలన
బుగ్గే నిమురుకుంటె నాకు అరె మొటిమై తగులుతుంటడే
లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నదే
ఇన్నాళ నా ఎదురు చూపులన్ని తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేలమీది మల్లెలన్ని తన నవ్వుల్లొ కుమ్మరిస్తడె
పేరే పలుకుతుంటె చాలు నా పెదవే తీయగవుతదే
తన చూపె తాకుతుంటె నన్ను అబ్బ నా మనసు పచ్చిగవుతదే
మెరిసె మెరుపల్లె వాడొస్తే అమ్మ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
యెదపై ఒక్కసరి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతదే
11.
అరె ఏమైందీ అరె ఏమైందీ
అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దురలేపింది
ఆ ఆ ఆ
అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో ఓ ఓ ఓ
లలలలలా లలల ల ల ల ల ల ల ల ల లలలలా
బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో
చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు
మనిషౌతాడు ఉ ఉ ఉ
అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దురలేపింది
అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
12.
ఏ రోజైతె చూసానో నిన్ను ఆరోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా యే దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తునానూ
నీ స్పర్శై ఈ వీచే గాలుల్లో
నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా
నీ కష్టంలో నేనూ ఉన్నానూ
కరిగే నీ కన్నీరవుతా నేను
చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతంలొ ఓదార్పవుతాను
కాలం యేదో గాయం చేసింది
నిన్నే మాయం చేసానంటొంది
లొకం నమ్మి అయ్యూ అంటొంది
శొకం కమ్మి జోకొడతానంది
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నా
నీతో గడిపిన ఆ నిమిషాలన్ని
నాలో మోగే గుండెల సవ్వడులే
అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగ
నువ్వు లేకుంటే నేనంటూ ఉండను గా
నీ కష్టంలో నేను ఉన్నాను
కరిగే నీ కన్నీరవుతా నేను
చెంపల్లో కారి నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతంలొ ఓదార్పవుతాను
ఏ రోజైతె చూసానో నిన్ను ఆరోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా యే దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నానూ
13.
హే.. ముత్యవల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
అరె ముట్టుకుంటే ముడుసుకుంటావ్ ఇంత సిగ్గా
మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
ఊరూ నిదరోయిందిలే .. మంచి సోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
కురిసే సన్నని వానా .. సలి సలిగా ఉన్నది లోనా
కురిసే సన్నని వానా .. సలి సలిగా ఉన్నది లోనా
గుబులౌతుందే గుండెల్లోనా
జరగనా కొంచెం .. నేనడగానా లంచం
చలికి తలలు వంచం .. నీ వళ్ళే పూలమంచం
వెచ్చగ ఉందామూ మనమూ
హే .. పైటలాగా నన్ను నువ్వూ కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే
మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
పండే పచ్చని నేలా .. అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా .. అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేలా .. అది తొలకరించు వేళా
తెలుసుకో పిల్లా .. ఈ బిడియమేల మళ్ళా
ఉరికే పరువమిదీ .. మనదీ
హే .. కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
దాపుకొస్తే కొర్కెలన్నీ తీరిపోవా
మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
నవ్వని పువ్వే నువ్వూ .. నునువెచ్చని తేనెలు ఇవ్వూ
దాగదు మనసే .. ఆగదు వయసే
ఎరగదే పొద్దూ .. అది దాటుతుంది హద్దు
ఈయవా ముద్దూ .. ఇక ఆగనే వద్దు
ఇద్దరమొకటవనీ .. కానీ
హే .. బుగ్గ మీదా మొగ్గలన్నీ దూసుకోనీ
రాతిరంతా జాగారమే చేసుకోనీ
మబ్బే మసకేసిందిలే .. పొగమంచే తెరగా నిలిసిందిలే
ఊరూ నిదరోయిందిలే .. మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచి సోటే మనకు కుదిరిందిలే
14.
సీకటమ్మ సీకటి ముంచటైన సీకటి
వెచ్చనైన ఊసులన్ని రెచ్చ గొట్టు చీకటి నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి ముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటి పొద్దు పొడుపేలేని సీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిదరోనీ రాయే రాయే రామ సిలక సద్దుకుపోయే సీకటెనక..ఆ నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసి కన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసి కలలే వలగా విసిరే చీకట్లలో నమ్మకు|| వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకు రవికిరణం కనపడితే తెలియును తేడాలన్ని నమ్మకు|| ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏనాటికి పక్కవారికి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ పక్కవారికి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ లేహాయి నాదోయి నీవైపు నడువకు నమ్మకు|| సీతకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏ కాకిలా సీతకాలంలో ఏ కోయిలైన రాగం తీసేనా ఏ కాకిలా మురిసే పువులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా పదుగురి సౌభ్యం పండే దినమే పండుగకాదా పదుగురి సౌభ్యం పండే దినమే పండుగకాదా ఆ నాడు ఆకంత గీతాలు పలుకును కాదా గసమ గసమ దమద నిదని మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ నమ్మకు||15.
చుట్టూ పక్కల చూడరా చిన్న వాడా
చుక్కలో చూపు చిక్కుకున్నవాడా
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం
స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా
తెప్ప తగలబెట్టేస్తావా యేరు దాటగానే
16.
ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం వస్తేనేగద గుండెబలం తెలిసేది దుఖ్ఖానికి తలవంచితే తెలివికింక విలువేది మంచైన చెడ్డైనా పంచుకోను నేలేనా ఆమాత్రం అత్మీయతకైన పనికిరాన ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది (4) గుండెల్లో సుడి తిరిగే కలత కథలు చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది (4) కోకిలల కుటుంబములో చెడబుట్టిన కాకిని అని అయినవాళ్ళు వెలివేస్తే అయినా నే ఏకాకిని పాత పాట మారాలని చెప్పడమే నా నేరం గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం వసంతాల అందం విరబూసే ఆనందం తేటి తేనె పాట పంచవన్నెల విరి తోట(2) బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట(2) చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది(2) ఏటి పొడుగున వసంతం ఒకటేనా కాలం ఏది మరి మిగతా కాలాలకు తాళం నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు వీరి గొంతులోనికేక వెనుక ఉన్నదే రాగం అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం అది అడిగిన నా ప్రశ్నకు అలిగె మత్తకోకిలా కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా నూతిలోని కప్పలా బ్రతకమన్న శాశనం కాదన్నందుకు అక్కడ కరువాయను నా స్థానం చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది(2) అసహాయతలో దడ దడ లాదే హృదయ మృదంగ ద్వానం నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం ఎడారి బ్రుతుకున నిత్యం చస్తూ సాగె బాధల బిడారు దిక్కూ మొక్కూ తెలియని దీనుల వ్యదార్థ జీవన స్వరాలు నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి జనజీవిని ఒద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ కలలో జీవించను నేను కలవరింత కోరను నేను నేను సైతం విశ్వ వీణకు తంత్రినై మూర్చనలు పోతాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను నేను సైతం ప్రపంచాద్యపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాక ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాక పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం17.
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా
త్రియానంద భోజా
మీ శ్రీచరణాంభుజములకు
ప్రేమతో నమస్కరించి
మిము వరించి
మీ గురించి
ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ
భయముతో భక్తితో అనురక్తితో
చాయంగల విన్నపములూ
సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు
ఎన్నెనెన్నొ కధలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో
నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహు
ప్రేమ లేఖ
ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరు
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి
తలలోన తురుముకున్న తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే
ఆహ్ అబ్బా
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే
ఆహ్ ఆహ్
మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి
ఇప్పుడే బదులివ్వండి
18.
మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి ...మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి ...
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల...ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ...తారాడే హాయి లో ...
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి ...
పలికే పెదవి వణికింది ఎందుకో ...వణికే పెదవీ వెనకాల ఏమిటో ...
కలిసే మనసులా ..విరిసే వయసులా ...కలిసే మనసులా ..విరిసే వయసులా ...
నీలి నీలి ఊసులు...లేత గాలి బాసలు...ఏమేమో అడిగినా...||మౌనమేలనోయి ||
హిమమే కురిసే చందమామ కౌగిటా ...సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా...
ఇవి ఎడడుగులా...వలపూ మడుగులా ...ఇవి ఎడడుగులా...వలపూ మడుగులా ...
కన్నె ఈడు ఉలుకులు ...చంటి పాప కబురులూ ...
ఎంతెంతో తెలిసినా ...
మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి ...మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి ...
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ...ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ...తారాడే హాయి లో ...
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
19.
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే..సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
కవినై..కవితనై..భార్యనై..భర్తనై
కవినై..కవితనై..భార్యనై..భర్తనై
మల్లెలదారిలో..మంచు ఎడారిలో
మల్లెలదారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలు..కన్నీటి జలపాతాల
నాతో నేను అంగమిస్తూ..నాతో నేను రమిస్తూ..
వంటరినై అనవరతం .. ఉంటున్నాను నిరంతరం
కలల్ని..కధల్ని..మాటల్ని..పాటల్ని..రంగుల్ని..రంగవల్లుల్ని..కావ్య కన్నెల్ని..ఆడపిల్లల్ని
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై..కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై..
వెన్నెల పూతల మంటను నేనై..
రవినై..శశినై..దివమై..నిశినై..
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిముషం .. కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల..హరిణాల్ని హరిణాల..చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని..ఇంద్రజాలాన్ని
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
గాలిపల్లకీ లోన తరలినా పాట పాప ఊరేగి వెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలీ..
నా హృదయమే నా పాటకి తల్లీ..
నా హృదయమే నాకు ఆలి..
నా హృదయములో ఇది సినీ వాలి..
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది
20.
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ…
ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న
నీ రూపం నా చూపులనోదీలేనా ఓ…
ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్న
నువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ…
కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవె ఐన
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా ....
1|| ఈ జన్మంతా విడిపోదీ జంట అనిదీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందా
నా వెనువెన్ట నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తరిమి అల వెనుదిరిగిన చెలిమి ఎలా తడి కనులతో నిను వెతికేది ఎలా || నా
2|| నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నల్ళైన సంతోషంగా గడిచాయనుకోన
నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నల్ళైన ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచెయమ సిరిమల్లెల పరిమళమా చేజారిన ఆశల తొలివరామా ||
21.
undefined
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకం కనులు మూసుకుని ఏం లాభం కలైపోదుగా ఏ సత్యం ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయాణం ప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా మోహమయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్నామొన్నలని నిలువెల్ల నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువ్వు ఎటువున్నా చినుకులా కరగక శిలై ఉండగల22.
రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా కలికి మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం
||రాలిపోయే||
చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై
||రాలిపోయే||
అనుభంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడి పోయే
తన రంగు మార్చింది రక్తమె తనతొ రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలె ఆకాశము నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై
||రాలిపోయే||
Labels:
నా తెలుగు


