* మీరు కొనే ప్లాటు దేని పరిధిలోకి వస్తుందో తెలుసుకోండి. ఆయా లేఅవుట్‌కి ఎవర్నుంచి అనుమతి ఉందో కనుక్కోండి. పాత లేఅవుట్లకు ఎంసీహెచ్, హుడా, డీటీసీపీలు అనుమతిచ్చేవి. సరికొత్త వెంచర్ అయితే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీల నుంచి అనుమతి తప్పనిసరి. స్థానిక సంస్థల ఆమోదం లేని వెంచర్‌లో అంటే అనధికార లేఅవుట్‌లో ప్లాటును కొంటే వెంటనే క్రమబద్ధీకరించుకోవాలి.
* పాత ఎంసీహెచ్, హుడాలో నమోదు కానీ గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ప్లాటు అని తెలిసి కొంటున్నా.. ఆయా లేఅవుట్‌ని క్రమబద్ధీకరిస్తారా లేదా అన్నది ముందుగానే విచారించండి. రోడ్డు వెడల్పు చేయడంలో స్థలాన్ని కోల్పోవాల్సి వస్తుందా అనేదీ ముఖ్యమే! ఉదాహరణకు ఎల్‌ఆర్‌ఎస్‌లో ఏదైనా ప్లాటుకు సంబంధించి పాతిక అడుగుల రోడ్డుంటే.. ఆ ప్లాటులో రహదారి ఉన్న వైపు 2.5 అడుగుల వెడల్పులో స్థలాన్ని రోడ్డు విస్తరణలో కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలపై క్షుణ్నంగా అవగాహనకు రండి.
* మాస్టర్ ప్లాన్ ప్రకారం మీరు కొనే ప్లాటు దెబ్బతినే అవకాశముందో లేదో చూసుకోవాలి. అక్రమ లేఅవుట్‌లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తును ఆమోదిస్తున్నా.. బృహత్ ప్రణాళికలో నివాస జోన్‌లో లేకపోతే.. క్రమబద్ధీకరణకు అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
* అక్రమ లేఅవుట్‌లో ప్లాటును రెగ్యులరైజ్ చేస్తున్నప్పటికీ.. సంబంధిత అధికారులు ఆ లేఅవుట్‌లో ఉండాల్సిన పది శాతం ఖాళీ స్థలం (ఓపెన్ స్పేస్) ఎంత తక్కువుంటే అంత నిష్పత్తిలో మార్కెట్ విలువ ప్రకారం కొనుగోలుదారులు రుసుమును భరించాల్సి ఉంటుంది.
* అక్రమ లేఅవుట్లలో కొనే ముందు ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్లాటు రెగ్యులరైజేషన్ చేసుకునే వీలుంటే.. అమ్మేవారి ద్వారానే ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకోవడం వల్ల రుసుము తగ్గే అవకాశముంది.
* స్థల స్వభావం, స్థల ఆకారంపై భవన నిర్మాణ ఖర్చు కొంత ఆధారపడి ఉంటుంది. ఒండ్రు, నల్లరేగడి, పల్లంలో ఉన్నవి, ఎత్త్తెన బండరాళ్లు ఉన్న భూమి, నాలాలు, చెరువులు, నదులు పక్కనుండే స్థలాల్లో ఇంటిని కడితే.. నిర్మాణ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎర్రమట్టి, మొరం, చదనుగా ఉన్న స్థలాల్లో ఖర్చు కొంత తక్కువౌతుందని గుర్తుంచుకోండి.
* విస్తీర్ణం అధికంగా ఉన్న రోడ్డు మీద చిన్న ప్లాటు కొంటే.. నిర్మాణంలో రోడ్డువైపు సెట్‌బ్యాకు ఎక్కువగా వదలాల్సి వస్తుంది. దీంతో ఇంటి సైజు గణనీయంగా తగ్గే అవకాశముంటుంది.
* ప్లాటు ఆకారాన్ని బట్టి ఇంటి విస్తీర్ణం ఆధారపడుతుంది. దీర్ఘచతుస్రాకారంలలో 1 : 1.5 నిష్పత్తిలో పొడవు, వెడల్పు ఉన్న ప్లాటులో భవనం చక్కగా వస్తుంది.
* నాలాలు, చెరువులు, నదులకు సమీపంలో ఉన్న ప్లాట్లు కొనేముందు..ప్రభుత్వ జీవో ప్రకారం.. నిర్థారిత బఫర్ జోన్ పరిధిలోకి ఈ ప్లాటు వస్తుందా లేదా అన్నది సరి చూసుకోవడం అన్నివిధాల శ్రేయస్కరం.
* ప్లాటు కొనేవారెవ్వరైనా.. న్యాయవాది సలహా తీసుకున్నాకే ముందడుగు వేయాలన్న విషయాన్ని మర్చిపోవద్దు.
* న్యాయ నిపుణులు ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాల నివేదికను అమ్మకందారుడ్ని అడగవ చ్చు. ఆ నివేదిక ఆస్బి చరిత్రను తెలియజేస్తుంది. ఎవరు అసలు యజమానులో, వారి నుంచి ఎవరికి ఎఆ ఏకాలంలో బదిలీ అయిందో ప్రస్తుత యజమాని ఎవరో ఇవన్నీ ఆస్తి చరిత్ర వెల్లడిస్తుంది. ఆస్తిపై రుణాలు తెచ్చినట్టు దాఖలాలున్నా తెలుస్తుంది. ఆస్తిపై రుణాలు తెచ్చినట్లు దాఖలాలున్నా తెలుస్తుం ది. ఆ రుణాలు పూర్తిగా చెల్లించేశారా ఇంకా కొంత బాకీ ఉన్నారా అన్న విషయాలు తెలుస్తాయి.
* ఆస్తి టైటిల్‌ను కూడా పరిశీలించవచ్చు. అమ్మకందారుడు ఆ టైటిల్ కాపీని ప్రస్తుత అగ్రిమెంట్ కాపీతో జత చేస్తే చాలా మంచిది. టైటిల్‌లో న్యాయపరమైన చిక్కులు, రుణ సమస్యలు, ఉంటే అవన్నీ ప్రస్తుత కొనుగోలుదారులు భరించ వలసివస్తుంది. గహ రుణం కోసం ప్రయత్నించేటప్పుడు టైటిల్ స్పష్టం గా ఉండాలి. మార్కెట్‌లో దానికి విలువ ఉండాలి. టైటిల్ ఆ విధంగా ఎలాంటి చిక్కులు లేకుండా క్లియర్‌గా ఉంటే అమ్మకందారుడు నిజమైన యజమాని అని గుండె మీద చెయ్యి వేసి చెప్పవచ్చు. సెర్చి రిపోర్ట్ ఆస్తి అమ్మకందారుడు నిజమైన యజమా ని అని సర్టిఫై చేస్తే ఇక కొనుగోలుకు ఎలాంటి అడ్డంకులు లేనట్టే.
ref:
http://www.vaartha.com/content/3953/before-land-purchage-search-report.html
http://www.eenadu.net/sthiramain.asp?qry=1706sthira5


